శ్రీమద్భాగవతంలో సూర్యగమనాన్ని
పోతనామాత్యులు వివరిస్తున్న పద్యం
మేషతులల యందు మిహిరుం డహోరాత్ర మందుఁ దిరుగు సమవిహారములను
బరఁగఁగ వృషభాది పంచరాసులను నొ క్కొక్క గడియ రాత్రి దక్కి నడచు.
మేషరాశిలో, తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాసులలో సంచరించే సమయంలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి తగ్గుతూ వస్తుంది.
మించి వృశ్చికాది పంచరాసులను నొక్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు;
దినములందు నెల్ల దిగజారు నొక్కొక్కగడియ నెలకుఁ దత్ప్రకారమునను.
సూర్యుడు పశ్చిమం, ధనుస్సు, మకరం, మీనం అనే ఐదు రాసులలో ఉన్నపుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంది. పగటికాలం తగ్గిపోతుంది.
No comments:
Post a Comment