Thursday 11 January 2018

ఆకాశంలో కనపడుతున్నవి నిరయణ గ్రహాలే. డా||శంకరమంచి రామకృష్ణ శాస్త్రి



ఆకాశంలో కనపడుతున్నవి నిరయణ గ్రహాలే. ఎందుకంటే స్పైకా స్టార్ దగ్గర సూర్యుడు ఉన్నప్పుడు 204.05.35 డిగ్రీలని చూపిస్తోంది. స్పైకా 180లో ఉంటుందని మనందరికీ తెలుసు. దీనిఅర్థ మేమంటే  వసంత సంపాతం నుండి లెక్కించాలని సూచిస్తోంది  అలాగే  స్పైకా స్టార్ కూడా 204.05.35 డిగ్రీలనే చూపిస్తోంది.  2017-10-17 తేదీన ఈ రెండూ ఒకే డిగ్రీలలో ఉనాయి. కాబట్టి ఆకాశంలో కనపడుతున్నవి నిరయణ గ్రహాలే. కేవలం డిగ్రీలుమాత్రం వసంత సంపాతం నుండి గణితం మెదలవుతుంది. ఆకాశంలో ప్రత్యక్షంగా కనపడే  గ్రహాలనే భారతీయులు గణితం చేశారు. దీనినే వైదిక విధానమంటారు. ప్రత్యక్షంగా ఆకాశంలో కనపడే  గ్రహాలను గణించాలంటే ముందుగా అశ్వినీతో అరంభమయ్యే స్థిరరాశిచక్రం తెలిసిఉండాలి.
కదులుతున్న సంపాతాశ్రిత చరరాశిచక్రం తెలిస్తేగాని  స్థిరరాశిచక్రం తెలియదు.  అంటే ఇక్కడ రెండు రాశి చక్రాల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉండాలి. ఇది చాలాకష్టమైన ప్రక్రియ. ఇంత కష్టమైన దానిని మన ప్రాచీన ఋషులు సిద్ధాంత గ్రంథాలలో చాలా సులభ సూత్రాలలో చెప్పారు. ఇదీ మన భారతీయుల గొప్పదనం.
అదేవిధంగా 14-01-2018 మధ్యాహ్నం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్న పిక్చర్ ని పైన చూడవచ్చు.
నమస్తే ఫ్రెండ్స్
మీ సిద్ధాన్తి
. డా||శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
12-01-2018 6-29-am

Wednesday 10 January 2018

సూర్య సిద్ధాంత రీత్యా దృక్కర్మ ఎక్కడ చేయాలి?


డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పిహెచ్. డి

సూర్య సిద్ధాంత రీత్యా గణితం చేస్తున్నప్పుడు స్పష్టాధికారం పూర్తయ్యేవరకు అనగా తిథి వార నక్షత్ర యోగ కరణాలు సాధించేంతవరకు సరాసరి నిరయణ గ్రహాలే వస్తాయి.
స్పష్టాధికారంలో కుజాది పంచగ్రహాలకు అష్టవిధ గతులు ఉన్నందున ఈ కుజాది పంచగ్రహాలకు దృక్ తుల్యతను సాధిస్తాము.
సూర్య చంద్రులకు స్పష్టాధికారంలో దృక్కర్మ చెప్పబడలేదు. కేవలం మందఫల సంస్కారం మాత్రమే ఉన్నది.
సూర్య చంద్రులకు గ్రహణాధ్యాయంలో దృక్కర్మ వస్తుంది. ఇది కేవలం సూర్య సిద్ధాంతాలలోని శ్లోకాలను వరుసగా చదివితేనే తెలుస్తుంది. అలాగే ప్రతి శ్లోకాన్ని అర్ధం చేసుకుంటూ గణిత సాధన చేయాలి. సూర్య సిద్ధాంతం గొప్పతనం ఏమంటే ముందుగా సాయన గ్రహాలు రావు. భారతీయ విధానంలో నిరయణ గ్రహాలు వస్తాయి. నక్షత్రాలతో కూడుకున్న స్థిర చక్రము ద్వారానే గ్రహాలను సాధిస్తాం.

తిధి వార నక్షత్ర యోగ కరణాలు సాధించడానికి సూర్య సిద్ధాంతంలో రవి చంద్రులకు దృక్కర్మ చెప్పబడలేదు.

దృక్కర్మ చేసే సందర్భములు:

నక్షత్ర గ్రహ యోగేషు గ్రహాస్తోదయ సాధనే
శృంగోన్నతౌతు చంద్రస్య దృక్కర్మాదావిదం స్మృతం
అనగా నక్షత్ర గ్రహ యోగముల యందు, గ్రహ ఉదయాస్తమయాలయందు, చంద్ర శృంగోన్నతి యందు దృక్కర్మ చేయవలెను. గ్రహ ఉదయాస్తమయాలను తెలుసుకునే క్రమంలో దృక్కర్మ చేయాలి. అలాగే గ్రహము నక్షత్రసంయోగము చెందినప్పుడు దృక్కర్మచేయాలి. నక్షత్ర సంయోగమంటే గ్రహాలు రాశి ప్రవేశం చేయటం. గ్రహాలు రాశిలో నక్షత్రాలను ఆధారం చేసుకొని ఉండటం. అలాగే సూర్య సంక్రాంతులు, జాతక పరిశీలనకు అవసరమైన గ్రహస్థితి ని చూచే సందర్భంలో తప్పనిసరిగా సూర్యాది సప్త గ్రహాలకి దృక్కర్మ చేసితీరాలి.
పంచాంగంలో చేసే తిథివార నక్షత్ర యోగ కరణములు మాత్రం స్పష్టాధికారంలో చెప్పిన విధంగానే సాధించాలి. ఎందుకంటే యుగ ప్రమాణాలు, అహర్గణ సాధన మొదలగునవి సాధించే క్రమంలో సావన తిథులు చాంద్ర తిథులు క్షయ తిథులు (అధిక మాసాలు) ఇవన్నీ సూర్య సిద్ధాంత రీత్యా మధ్యమాధి కారంలో ఎలా చెప్పారో అలాగే సాధించాలి

Monday 1 January 2018

బృహత్పారాశరహోరాశాస్త్రమును శ్లోక రూపంలో పారాయణం- 1 సృష్టిక్రమకథనాధ్యాయము

బృహత్పారాశరహోరాశాస్త్రమ్
1 సృష్టిక్రమకథనాధ్యాయః
బృహత్పారాశరహోరాశాస్త్రమును శ్లోక రూపంలో పారాయణం చేయడంవల్ల జ్యోతిషశాస్త్రం పై పట్టువస్తుంది.  
 ముందుగా ఒకటవ అధ్యాయమై  సృష్టిక్రమకథనాధ్యాయమును పరిశీలిద్దాం.

                               డా|| శంకరమంచి రామకృష్ణ శాస్త్రి  పిహెచ్. డి. (జ్యోతిషశాస్త్రం)

                 శ్రీమహాగణాధిపతయేనమః శ్రీగురుభ్యోనమః హరిః ఓం

 1 సృష్టిక్రమకథనాధ్యాయః
గజాననం భూతగణాదిసేవితం కపిత్థజమ్బూఫలసారభక్షణమ్ ।
ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజమ్ ॥


అథైకదా మునిశ్రేష్ఠం త్రికాలజ్ఞం పరాశరమ్ ।
పప్రచ్ఛోపేత్య మైత్రేయః ప్రణిపత్య కృతాఞ్జలిః ॥ 1

భగవన్ పరమం పుణ్యం గుహ్యం వేదాఙ్గముత్తమమ్ ।
త్రిస్కన్ధం జ్యౌతిషం హోరా గణితం సంహితేతి చ ॥ 2

ఏతేష్వపి త్రిషు శ్రేష్ఠా హోరేతి శ్రూయతే మునే ।
త్వత్తస్తాం శ్రోతుమిచ్ఛామి కృపయా వద మే ప్రభో ॥ 3

కథం సృష్టిరియం జాతా జగతశ్చ లయః కథమ్ ।
ఖస్థానాం భూస్థతానాం చ సమ్బన్ధం వద విస్తరాత్ ॥ 4

సాధు పృష్టం త్వయా విప్ర లోకానుగ్రహకారిణా
అథాహం పరమం బ్రహ్మ తచ్ఛక్తిం భారతీం పునః ॥ 5

సూర్యం నత్వా గ్రహపతిం జగదుత్పత్తికారణమ్
వక్ష్యామి వేదనయనం యథా బ్రహ్మముఖాచ్ఛ్రుతమ్ ॥ 6

శాన్తాయ గురుభక్తాయ సర్వదా సత్యవాదినే ।
ఆస్తికాయ ప్రదతవ్యం తతః శ్రేయో హ్యవాప్స్యతి ॥ 7

న దేయం పరశిష్యాయ నాస్తికాయ శఠాయ వా ।
దత్తే ప్రతిదినం దుఃఖం జాయతే నాత్ర సంశయః ॥ 8

ఏకోఽవ్యక్తాత్మకో విష్ణురనాదిః ప్రభురీశ్వరః ।
శుద్ధసత్వో జగత్స్వామీ నిర్గుణస్త్రిగుణాన్వితః ॥ 9

సంసారకారకః శ్రీమాన్నిమిత్తాత్మా ప్రతాపవాన్ ।
ఏకాంశేన జగత్సర్వ సృజత్యవతి లీలయా ॥ 10

త్రిపాదం తస్య దేవత్య హ్యమృతం తత్త్వదర్శినః ।
విదన్తి తత్ప్రమాణం చ సప్రధానం తథైకపాత్ ॥ 11

వ్యక్తావ్యక్తాత్మకో విష్ణుర్వాసుదేవస్తు గీయతే ।
యదవ్యక్తాత్మకో విష్ణుః శక్తిద్వయసమన్వితః ॥ 12

వ్యక్తాత్మకస్త్రిభిర్యుక్తః కథ్యతేఽనన్తశక్తిమాన్ ।
సత్త్వప్రధానా శ్రీశక్తిర్భూశక్తిశ్చ రజోగుణా ॥ 13

శక్తిస్తృతీయా యా ప్రోక్తా నీలాఖ్యా ధ్వాన్తరూపిణీ ।
వాసుదేవశ్చతుర్థోఽభూచ్ఛ్రీశక్త్యా ప్రేరితో యదా ॥ 14

సంకర్షణశ్చ ప్రద్యుమ్నోఽనిరుద్ధ ఇతి మూర్తిధృక్ ।
తమఃశక్త్యాఽన్వితో విష్ణుర్దేవః సంకర్షణాభిధః ॥ 15

ప్రద్యుమ్నో రజసా శక్త్యాఽనిరుద్ధః సత్త్వయా యుతః ।
మహాన్ సంకర్షణాజ్జాతః ప్రద్యుమ్నాద్యదహంకృతిః ॥ 16

అనిరుద్ధాత్ స్వయం జాతో బ్రహ్మాహంకారమూర్తిధృక్ ।
సర్వేషు సర్వశక్తిశ్చ స్వశక్త్యాఽధికయా యుతః ॥ 17

అహంకారస్త్రిధా భూత్వా సర్వమేతద్విస్తరాత్ ।
సాత్త్వికో రాజసశ్చైవ తామసశ్చేదహంకృతిః ॥ 18

దేవా వైకారికాజ్జాతాస్తైజసాదిన్ద్రియాణి చ

తామసచ్చైవ భూతాని ఖాదీని స్వస్వశక్తిభిః ॥ 19

 ఒకటవ అధ్యాయమై  సృష్టిక్రమకథనాధ్యాయము పూర్తి అయినది

శ్రీమద్భాగవతంలో రాశులగురించి చెబుతున్న సందర్భం


శ్రీమద్భాగవతంలో సూర్యగమనాన్ని పోతనామాత్యులు వివరిస్తున్న పద్యం
మేషతులల యందు మిహిరుం డహోరాత్ర మందుఁ దిరుగు సమవిహారములను
బరఁగఁగ వృషభాది పంచరాసులను నొ క్కొక్క గడియ రాత్రి దక్కి నడచు.
మేషరాశిలో, తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాసులలో సంచరించే సమయంలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి తగ్గుతూ వస్తుంది.

మించి వృశ్చికాది పంచరాసులను నొక్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు;
దినములందు నెల్ల దిగజారు నొక్కొక్కగడియ నెలకుఁ దత్ప్రకారమునను.

సూర్యుడు పశ్చిమం, ధనుస్సు, మకరం, మీనం అనే ఐదు రాసులలో ఉన్నపుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంది. పగటికాలం తగ్గిపోతుంది.

  आमुख मन्त्रेश्वर कृत फलदीपिका जातक ग्रन्थों की शृङ्खला की एक अनुपम कड़ी है। यह ग्रन्थ अपने मूल रूप में प्राचीन भारतीय लिपि ' ग्रन्थ ...