ఆకాశంలో కనపడుతున్నవి నిరయణ గ్రహాలే. ఎందుకంటే స్పైకా స్టార్ దగ్గర సూర్యుడు ఉన్నప్పుడు 204.05.35 డిగ్రీలని చూపిస్తోంది. స్పైకా 180లో ఉంటుందని మనందరికీ తెలుసు. దీనిఅర్థ మేమంటే వసంత సంపాతం నుండి లెక్కించాలని సూచిస్తోంది అలాగే స్పైకా స్టార్ కూడా 204.05.35 డిగ్రీలనే చూపిస్తోంది. 2017-10-17 తేదీన ఈ రెండూ ఒకే డిగ్రీలలో ఉనాయి. కాబట్టి ఆకాశంలో కనపడుతున్నవి నిరయణ గ్రహాలే. కేవలం డిగ్రీలుమాత్రం వసంత సంపాతం నుండి గణితం మెదలవుతుంది. ఆకాశంలో ప్రత్యక్షంగా కనపడే గ్రహాలనే భారతీయులు గణితం చేశారు. దీనినే వైదిక విధానమంటారు. ప్రత్యక్షంగా ఆకాశంలో కనపడే గ్రహాలను గణించాలంటే ముందుగా అశ్వినీతో అరంభమయ్యే స్థిరరాశిచక్రం తెలిసిఉండాలి.
కదులుతున్న సంపాతాశ్రిత చరరాశిచక్రం తెలిస్తేగాని స్థిరరాశిచక్రం తెలియదు. అంటే ఇక్కడ రెండు రాశి చక్రాల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉండాలి. ఇది చాలాకష్టమైన ప్రక్రియ. ఇంత కష్టమైన దానిని మన ప్రాచీన ఋషులు సిద్ధాంత గ్రంథాలలో చాలా సులభ సూత్రాలలో చెప్పారు. ఇదీ మన భారతీయుల గొప్పదనం.
అదేవిధంగా 14-01-2018 మధ్యాహ్నం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్న పిక్చర్ ని పైన చూడవచ్చు.
నమస్తే ఫ్రెండ్స్
మీ సిద్ధాన్తి
. డా||శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
12-01-2018 6-29-am
No comments:
Post a Comment