Wednesday, 10 January 2018

సూర్య సిద్ధాంత రీత్యా దృక్కర్మ ఎక్కడ చేయాలి?


డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పిహెచ్. డి

సూర్య సిద్ధాంత రీత్యా గణితం చేస్తున్నప్పుడు స్పష్టాధికారం పూర్తయ్యేవరకు అనగా తిథి వార నక్షత్ర యోగ కరణాలు సాధించేంతవరకు సరాసరి నిరయణ గ్రహాలే వస్తాయి.
స్పష్టాధికారంలో కుజాది పంచగ్రహాలకు అష్టవిధ గతులు ఉన్నందున ఈ కుజాది పంచగ్రహాలకు దృక్ తుల్యతను సాధిస్తాము.
సూర్య చంద్రులకు స్పష్టాధికారంలో దృక్కర్మ చెప్పబడలేదు. కేవలం మందఫల సంస్కారం మాత్రమే ఉన్నది.
సూర్య చంద్రులకు గ్రహణాధ్యాయంలో దృక్కర్మ వస్తుంది. ఇది కేవలం సూర్య సిద్ధాంతాలలోని శ్లోకాలను వరుసగా చదివితేనే తెలుస్తుంది. అలాగే ప్రతి శ్లోకాన్ని అర్ధం చేసుకుంటూ గణిత సాధన చేయాలి. సూర్య సిద్ధాంతం గొప్పతనం ఏమంటే ముందుగా సాయన గ్రహాలు రావు. భారతీయ విధానంలో నిరయణ గ్రహాలు వస్తాయి. నక్షత్రాలతో కూడుకున్న స్థిర చక్రము ద్వారానే గ్రహాలను సాధిస్తాం.

తిధి వార నక్షత్ర యోగ కరణాలు సాధించడానికి సూర్య సిద్ధాంతంలో రవి చంద్రులకు దృక్కర్మ చెప్పబడలేదు.

దృక్కర్మ చేసే సందర్భములు:

నక్షత్ర గ్రహ యోగేషు గ్రహాస్తోదయ సాధనే
శృంగోన్నతౌతు చంద్రస్య దృక్కర్మాదావిదం స్మృతం
అనగా నక్షత్ర గ్రహ యోగముల యందు, గ్రహ ఉదయాస్తమయాలయందు, చంద్ర శృంగోన్నతి యందు దృక్కర్మ చేయవలెను. గ్రహ ఉదయాస్తమయాలను తెలుసుకునే క్రమంలో దృక్కర్మ చేయాలి. అలాగే గ్రహము నక్షత్రసంయోగము చెందినప్పుడు దృక్కర్మచేయాలి. నక్షత్ర సంయోగమంటే గ్రహాలు రాశి ప్రవేశం చేయటం. గ్రహాలు రాశిలో నక్షత్రాలను ఆధారం చేసుకొని ఉండటం. అలాగే సూర్య సంక్రాంతులు, జాతక పరిశీలనకు అవసరమైన గ్రహస్థితి ని చూచే సందర్భంలో తప్పనిసరిగా సూర్యాది సప్త గ్రహాలకి దృక్కర్మ చేసితీరాలి.
పంచాంగంలో చేసే తిథివార నక్షత్ర యోగ కరణములు మాత్రం స్పష్టాధికారంలో చెప్పిన విధంగానే సాధించాలి. ఎందుకంటే యుగ ప్రమాణాలు, అహర్గణ సాధన మొదలగునవి సాధించే క్రమంలో సావన తిథులు చాంద్ర తిథులు క్షయ తిథులు (అధిక మాసాలు) ఇవన్నీ సూర్య సిద్ధాంత రీత్యా మధ్యమాధి కారంలో ఎలా చెప్పారో అలాగే సాధించాలి

No comments:

Post a Comment

  आमुख मन्त्रेश्वर कृत फलदीपिका जातक ग्रन्थों की शृङ्खला की एक अनुपम कड़ी है। यह ग्रन्थ अपने मूल रूप में प्राचीन भारतीय लिपि ' ग्रन्थ ...